కొత్త ఆంక్షలు : ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ చేయొద్దు..

కొత్త ఆంక్షలు : ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ చేయొద్దు..

హైదరాబాద్ ట్యాంక్ బండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూరిస్ట్ స్పాట్ కావడంతో  వీకెండ్ వచ్చిందంటే  ఫుల్ రష్ ఉంటుంది.  కాస్త సమయం దొరికిందంటే చాలు సాగర తీరానా సేద తీరుతుంటారు.  

కాలేజీ యువత,సిటీలోని పలు ఏరియాల్లోని జనం వచ్చి చూసి ఎంజాయ్ చేస్తుంటారు.  అర్థరాత్రి హుస్సేన్ సాగర్ చుట్టూ  కేక్ లతో  బర్త్ డేలు, మ్యారేజ్ డేలు సెలబ్రేట్ చేసుకుని హంగామా సృష్టిస్తారు.  మొత్తం కాగితాలు, అట్టముక్కులతో చెత్తచెత్తగా తయారు చేస్తారు. కొన్ని సార్లు ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తారు. దీంతో గొడవలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. 

అయితే స్వచ్ఛ హైదరాబాద్  మిషన్ కింద  జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్ చుట్టూ చెత్తవేసినా.. కేక్ లు కటింగులు నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. ఒక వేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే  ఫైన్ వేస్తామని హెచ్చరించింది.  అంతేగాకుండా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో  నిత్యం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని నిత్యం గమనిస్తూ జరిమానా విధిస్తామని బోర్టులు పెట్టింది.