పోలీసులు డ్రగ్స్పై దృష్టి పెట్టాలి..డ్రమ్స్పై కాదు : వర్మ

పోలీసులు డ్రగ్స్పై దృష్టి పెట్టాలి..డ్రమ్స్పై కాదు : వర్మ

హైదరాబాద్లోని పబ్లలో రాత్రి పదిగంటల తర్వాత సౌండ్ నిషేధంపై రాంగోపాల్ వర్మ ఆగ్రహ వ్యక్తం చేశారు. పోలీసులు డ్రగ్స్ దృష్టి పెట్టాలని.. డ్రమ్స్పై కాదన్నారు. రాత్రి 10 గంటల తర్వాత పబ్లలో మ్యూజిక్ వద్దంటే హైదరాబాద్ వాసులందరు బెంగళూరుకు పారిపోతారని ట్వీట్ చేశారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో టాప్ ఉందని.. ప్రస్తుతం సిటీ తాలిబన్ల రాజ్యంలోకి వెళ్తున్నట్లు అనిపిస్తోందన్నారు. అందరూ ఒకే దేశంలో నివసిస్తున్నప్పుడు హైదరాబాద్లో మాత్రమే తాలిబన్ల పాలన ఎందుకని ప్రశ్నించారు. 

రాత్రి 10 గంటల తర్వాత  పబ్లలో మ్యూజిక్  లేకపోతే స్మశానంలో ఉన్నట్లు ఉందని వర్మ అన్నారు.  పబ్లలో మ్యూజిక్ ఎప్పటిదాక కొనసాగించాలన్నది నిర్వాహకులకే విడిచిపెట్టాలని చెప్పారు. పబ్ కల్చర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని..అలా కాకుండా యువత ఆనందాన్ని బలవంతంగా అణిచివేయాలని చూస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని మండిపడ్డారు.