జర్నలిస్టుల సమస్యలపై ..కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాలి : హెచ్​యూజే

జర్నలిస్టుల సమస్యలపై ..కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాలి : హెచ్​యూజే

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగాబాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి కృషి చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) విజ్ఞప్తి చేసింది. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, బీమా పథకం తీసుకురావాలని కోరింది.

సోమవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో హెచ్ యూజే కార్యవర్గ సమావేశం జరిగింది. టీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య హాజరై జిల్లా కమిటీకి మార్గనిర్దేశం చేశారు.  

అనంతరం హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్ మాట్లాడుతూ సిటీలో  ఏండ్లుగా  పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వడం లేదని, కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.    టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, విజయానంద్  పాల్గొన్నారు.