ఫైన్ కడితే సీజ్ చేసినట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేయండి

ఫైన్ కడితే సీజ్ చేసినట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేయండి
  • ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇసుక అక్రమ రవాణా కేసులో జరిమానా చెల్లిస్తే, సీజ్ చేసిన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేసి, యజమాని బండి చెన్నయ్యపై కేసు నమోదు చేశారు. అయితే, ఫైన్ కట్టినా సీజ్ చేసిన తన ట్రాక్టర్ ఇవ్వకపోవడంతో బండి చెన్నయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారించారు.

ప్రభుత్వ జీవో ప్రకారం.. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన తొలిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.15 వేలు జరిమానా చెల్లించాలి. పిటిషనర్ జరిమానా చెల్లించినందునా గనుల శాఖ అధికారులు ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలని పోలీసులకు లేఖ రాశారు. అయినప్పటికీ, పోలీసులు వాహనాన్ని విడుదల చేయకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.వాదనల అనంతరం, హైకోర్టు కేసును కొట్టివేస్తూ, జరిమానా చెల్లించిన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.