ఇండియన్‌‌‌‌ పికిల్‌ ‌‌‌బాల్‌‌‌ ‌ లీగ్‌ ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌

 ఇండియన్‌‌‌‌  పికిల్‌ ‌‌‌బాల్‌‌‌ ‌ లీగ్‌  ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియన్‌‌‌‌ పికిల్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వాలిఫయర్స్‌‌‌‌–1లో హైదరాబాద్‌‌‌‌ 4–2తో చెన్నై సూపర్‌‌‌‌ వారియర్స్‌‌‌‌పై గెలిచింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో చెన్నై ప్లేయర్‌‌‌‌ మిచ్ హార్గ్రీవ్స్ 15–11తో విజయం సాధించడమే కాకుండా హర్ష్‌‌‌‌ మెహతాతో కలిసి డబుల్స్‌‌‌‌లోనూ అదే స్కోరుతో నెగ్గి శుభారంభాన్ని అందించాడు. 

అయితే 0–2తో వెనకబడిన హైదరాబాద్‌‌‌‌ అద్భుతంగా పుంజుకుంది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో మేగన్‌‌‌‌ ఫడ్జ్‌‌‌‌ 15–13తో రూస్‌‌‌‌ వాన్‌‌‌‌ రీక్‌‌‌‌పై గెలిచి అందర్నీ  ఆశ్చర్యపరిచింది. ఈ విజయంతో జోరు మీదున్న హైదరాబాద్​ విమెన్స్​ డబుల్స్​, నిర్ణయాత్మక గ్రాండ్‌‌‌‌ ర్యాలీలో ఫడ్జ్‌‌‌‌–శ్రేయ చక్రవర్తి 21–17తో చెన్నైని చిత్తు చేసి ఫైనల్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకున్నారు. 

మరోవైపు ముంబై స్మాషర్స్‌‌‌‌ కూడా ఫైనల్‌‌‌‌ చేరింది. ముందుగా ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 4–2తో లక్నో లియోపర్డ్స్‌‌‌‌ను ఓడించి క్వాలిఫయర్‌‌‌‌–2కు అర్హత సాధించింది. తర్వాత క్వాలిఫయర్‌‌‌‌–2లో 4–2తో చెన్నై సూపర్‌‌‌‌ వారియర్స్‌‌‌‌పై నెగ్గింది. ఆదివారం జరిగే టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ రాయల్స్‌‌‌‌.. ముంబై స్మాషర్స్‌‌‌‌తో తలపడుతుంది.