నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్.. దేశంలో 3వ స్థానం

నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్.. దేశంలో 3వ స్థానం

నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుంది. టాలెంట్‌‌‌‌ను ఆకర్షించే నగరాల్లో ముంబైని వెనక్కి నెట్టి హైదరాబాద్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. లింక్‌‌‌‌డ్ఇన్ విడుదల చేసిన ఇండియా వర్క్‌‌‌‌ఫోర్స్ రిపోర్ట్‌‌‌‌లో ఈవిషయాన్ని వెల్లడించింది. ఉత్తమ ఉద్యోగాలు,ఎక్కువ డిమాండ్ ఉన్న నైపుణ్యాలతో పాటు టాలెంట్‌‌‌‌ను ఆకర్షిస్తున్న నగరాలవంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారించి 2018 ఆరు నెలల కాలానికి రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. 2018 లో ఎక్కువగా సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్, బిజినెస్ మేనేజ్‌ మెంట్ ఉద్యోగాలనే అందరూ కావాలనుకుంటున్నా రని లింక్‌‌‌‌డ్ఇన్ రిపోర్ట్‌‌‌‌లో తెలిపింది. 2018 రెండో అర్థవార్షికంలో సాఫ్ట్‌‌‌‌వేర్&ఐటీ సర్వీసెస్, మానుఫాక్చరింగ్ , ఫైనాన్స్‌‌‌‌తో పాటు కార్పోరేట్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ వంటివి ఉత్తమ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. వేగంగా వృద్ధిచెందుతున్న వాటిలో ఫైనాన్స్, వెల్‌‌‌‌నెస్ అండ్ఫిట్‌‌‌‌నెస్, రియల్ ఎస్టేట్, లీగల్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌ మెంట్వంటివి ఉన్నాయి. హైదరాబాద్, ముంబైలలో హెల్త్‌‌‌‌కేర్ ఉత్తమ 5 పరిశ్రమల్లో చోటుదక్కించుకుంది.

మేనేజ్మెంట్ ,టెక్నికల్ స్కిల్స్ కావాలి
అన్ని విభాగాల్లోకంటే మేనేజ్‌ మెంట్, టెక్నికల్ స్కిల్స్ వంటివాటికి ఎక్కువ డిమాండ్ ఉంది.ఎస్‌‌‌‌క్యూఎల్, జావా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్సీ వంటివి సాఫ్ట్‌‌‌‌వేర్, ఐటీ,ఫైనాన్స్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆటోకాడ్ నైపుణ్యానికి తయారీ, నిర్మాణం, ఎనర్జీ అండ్ మైనింగ్ , డిజైన్ వంటి పరిశ్రమల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. న్యూఢిల్లీ, ముంబై నగరాలు మేనేజ్‌ మెంట్ స్కిల్స్‌‌‌‌పై ఎక్కువగా దృష్టి సారించగా,ఇండియా ఐటీ క్యాపిటల్ బెంగుళూరు ఎక్కువగా టెక్నికల్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌‌‌‌పై దృష్టి కేంద్రీకరిస్తోంది.సాఫ్ట్‌‌‌‌వేర్, ఐటీ సేవల్లో ఎస్‌‌‌‌క్యూఎల్, సీ, సీప్లస్‌‌‌‌ప్లస్, హెచ్‌ టీఎమ్ఎల్, జావా స్క్రిప్ట్ వంటి స్కిల్స్‌‌‌‌ ఎగుమతుల్లో ఇండియా మొదటిస్థానంలో కొనసాగుతోంది. ముగ్గురిలో ఒకరు యూఎస్‌‌‌‌కే ఇండియాలో సగం మంది ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకోసం ఎన్‌ సీఆర్ (ఢిల్లీ, గుర్గావ్ ,నోయిడా), బెంగుళూరు,హైదరాబాద్, ముంబై, చెన్నైనగరాలనే ఎంచుకుంటున్నారు. ఆ తరువాతి స్థానాల్లో కోల్‌‌‌‌కతా, అహ్మదాబాద్, చండీఘర్, వడోదర, జైపూర్వంటివి ఉన్నాయి. ఇండియా నుండి విదేశాల్లో ఉద్యోగానికి ఆసక్తి చూపే వాటిలో యూఎస్ మొదటి స్థానంలో ఉంది.ఇండియా నుండి ఉద్యోగానికి బయటకు వెళ్లే ప్రతీ ముగ్గురి లో ఒకరు యూఎస్‌‌‌‌కే వెళ్తున్నారు. ఆతరువాత యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియా నుండి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన 70 శాతం మంది ఈఐదు దేశాలనే ఎంచుకున్నారు. సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్లకు జర్మనీ, యూఎస్, కెనడాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండగా, ఆ తరువాతి స్థానంలో సేల్స్ పర్సన్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉద్యోగాలున్నాయి.