శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.1 కేజీల బంగారం సీజ్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.1 కేజీల బంగారం సీజ్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ రవాణాకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ అడ్డదారులు తొక్కుతున్నారు. కస్టమ్స్ కళ్లుగప్పి గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో మరోసారి బంగారం పట్టుబడింది. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 2.1 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 

దుబాయ్ నుంచి వస్తున్న  ముంజా ప్రసాద్ గౌడ్ అనే ప్రయాణికుడు వద్ద నుంచి బంగారు బిస్కెట్లను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేయగా పట్టుకున్నారు. లగేజ్ బ్యాగ్ స్కానింగ్ లో  అక్రమ బంగారం గుట్టు రట్టు అయ్యింది. అనంతరం  గోల్డ్ ను సీజ్ చేశారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.