11,100 మంది మిలియనీర్లతో హైదరాబాద్ కు 65వ స్థానం

11,100 మంది మిలియనీర్లతో హైదరాబాద్ కు 65వ స్థానం

వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ మరోసారి నిలిచింది. ఈ సిటీ 3.40 లక్షల మంది మిలియనీర్లతో వరల్డ్ రిచ్చెస్ట్ సిటీల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ వెల్తీయెస్ట్ సిటీస్ 2023 జాబితాను అంతర్జాతీయ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్​నర్స్’ విడుదల చేసింది. ఇందులో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈస్ట్ ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ల నుంచి 97 సిటీలకు చోటు దక్కింది. టాప్ 10 జాబితాలో అమెరికాకు చెందిన నాలుగు నగరాలు, చైనాకు చెందిన రెండు నగరాలు ఉన్నాయి. ఈ లిస్టులో మన దేశం నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూర్, కోల్ కతా, హైదరాబాద్కు చోటు దక్కింది. మన దేశంలో అత్యంత ధనిక నగరంగా మొదటి స్థానం సంపాదించిన ముంబై.. ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ 36, బెంగళూర్ 60, కోల్ కతా 63, హైదరాబాద్ 65వ స్థానంలో ఉంది.