ఐదో స్టార్టప్‌‌‌‌ హబ్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌

ఐదో స్టార్టప్‌‌‌‌ హబ్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌
  • 900 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వచ్చాయి: జస్ట్‌‌‌‌ డయల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశంలోని టాప్ 5  స్టార్టప్‌‌‌‌ హబ్‌‌‌‌లలో ఒకటిగా  హైదరాబాద్‌‌‌‌ నిలిచింది.  మనకంటే  ముందు బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, పూణె సిటీలు ఉన్నాయి.  హైదరాబాద్‌‌‌‌లో స్టార్టప్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ బలపడుతోందని,  ఇప్పటి వరకు  సుమారు 900 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు రావడమే ఇందుకు నిదర్శనమని జస్ట్‌‌‌‌ డయల్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.   ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లను సపోర్ట్ చేయడంలో కీలకంగా ఉన్నామని, క్లయింట్లను బిజినెస్‌‌‌‌లను కలుపుతున్నామని  వెల్లడించింది.  ‘2014 లో నా సొంత కంపెనీని పెట్టాను. ఆ టైమ్‌‌‌‌లో  క్లయింట్లను వెతుక్కోవడంలో ఇబ్బంది పడ్డాను. తర్వాత జస్ట్‌‌‌‌ డయల్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లతో కలిసి మినిమల్ ప్యాకేజితో కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. 

2018–19 నాటికి రూ.ఏడు లక్షలు ఇన్వెస్ట్ చేసి కార్పొరేట్ ప్యాకేజి తీసుకున్నాను. ఆరు నెలల్లోనే నా పెట్టుబడి తిరిగొచ్చేసింది’ అని జస్ట్‌‌‌‌ డయల్ కస్టమర్ సివిల్ స్ట్రక్చర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌  మధుసూదన్  పేర్కొన్నారు. 2014 లో బిజినెస్ స్టార్ట్ చేశానని, జస్ట్‌‌‌‌ డయల్‌‌‌‌ సాయంతో బెంగళూరు, చెన్నై, చండీగఢ్​ వంటి సిటీలకు తన సర్వీస్‌‌‌‌లను విస్తరించానని మరో ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్‌‌‌‌‌‌‌‌, పయనీర్‌‌‌‌‌‌‌‌ లాజిస్టిక్స్‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ కుమార్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  ఐదేళ్ల క్రితం జస్ట్‌‌‌‌ డయల్‌‌‌‌లో రిజిస్టర్ అయ్యామని, అప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని మ్యూజికల్‌‌‌‌ మార్ట్‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌ అబ్బాస్‌‌‌‌ వెల్లడించారు.