పెరిగిన బంగారం.. భారీగా తగ్గిన వెండి .. హైదరాబాద్లో తాజా ధరలు ఇవే

పెరిగిన బంగారం.. భారీగా తగ్గిన వెండి .. హైదరాబాద్లో తాజా ధరలు ఇవే

పెళ్లీల సీజన్ కావడంతో బంగారం ధరల్లో  మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీతో పోలిస్తే సెప్టెంబర్ 5వ తేదీన బంగారం ధరలు పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై  నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. 

సెప్టెంబర్ 5వ తేదీన  బంగారం ధరలు  పెరిగాయి. ప్రస్తుతం  మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320గా పలుకుతోంది.  అయితే గడిచిన  24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. 

ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,470గా పలుకుతోంది. మన హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 55,300 ఉంది. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా పలుకుతోంది. 

అటు చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600లు ఉంది.  24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా ఉంది.  ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల  పసిడి ధర రూ. 60,320గా కొనసాగుతోంది. ఏపీలోని  విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300గా పలుకుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,320గా కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం ధరలతో పోల్చుకుంటే  వెండి ధర కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం  మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 76,200లుగా పలుకుతోంది. సెప్టెంబర్ 4వ తేదీతో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 తగ్గడం విశేషం. తగ్గిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 80,000లుగా ఉంది.  ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200గా పలుకుతోంది.  చెన్నైలో రూ. 80,000గా ఉండగా..బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 గా నమోదైంది. ఏపీలోని  విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000లకు అమ్ముడవుతోంది.