హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 7 ప్లాట్లలో భూముల వేలం ముగిసింది. అత్యధికంగా ప్లాట్ నంబర్ 10 లో ఎకర వంద కోట్ల 75 లక్షలు పలికింది. రాజ్ పుష్ప, హ్యాపీ హైట్స్ కంపెనీ భూమిని దక్కించుకుంది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే హయ్యెస్ట్ రేటు. మొత్తం 45.33ఎకరాలకు వేలం జరిగింది. ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏ ప్లాట్ లో ఎంత రేటంటే?
- ప్లాట్ నంబర్ 14 లో ఎకరా రూ.70 కోట్లు
- ప్లాట్ నంబర్ 10 లో ఎకరా రూ.100.75 కోట్లు
- ప్లాట్ నంబర్ 11 లో ఎకరం రూ.67.25 కోట్లు
- ప్లాట్ నంబర్ 9 లో ఎకరా రూ.75.25 కోట్లు
- ప్లాట్ నంబర్ 8 లో ఎకరా రూ.68 కోట్లు,
- ప్లాట్ నంబర్ 7 లో ఎకరా రూ. 75.50 కోట్లు,
- ప్లాట్ నంబర్ 6 లో ఎకరా రూ. 73 కోట్లు
ఇవాళ నిర్వహించిన రెండో దశ ఈ-వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటా పోటీగా బిడ్లు దాఖలు చేశాయి. ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. మైహోం, రాజ్ పుష్ప సంస్థల మధ్య భూములను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి.
