ఓఆర్‌‌ఆర్ పరిధిలో డయల్ ఎ సెప్టిక్ట్యాంక్

ఓఆర్‌‌ఆర్ పరిధిలో డయల్ ఎ సెప్టిక్ట్యాంక్
  • ప్రారంభించిన మెట్రో వాటర్ బోర్టు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ కోసం మెట్రో వాటర్ బోర్డు ‘డయల్-–ఎ-–సెప్టిక్-ట్యాంక్ ’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) సహకారంతో 50 మంది వాహన ఆపరేటర్లకు శాస్త్రీయ శిక్షణ ఇవ్వడమే కాకుండా భద్రతా సామగ్రి, యూనిఫామ్​లు అందజేశారు.

 జీహెచ్‌‌ఎంసీ అవతల, ఓఆర్ఆర్​పరిధిలోని 7 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 18 గ్రామాల్లోని వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జీపీఎస్ ట్రాకింగ్‌‌తో వాహనాలను పర్యవేక్షిస్తామన్నారు. సేవల కోసం 155313 / 14420 నంబర్లకు కాల్ చేయవచ్చని సూచించారు.