
హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం హైదరాబాద్‌లో గంటకు 41 నుండి 61 కిమీ వేగంతో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో 2023 జూలై 12 నుండి 15 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం .. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, షేక్‌పేటలో మాత్రమే 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.