మలబార్‌‌‌‌ సోమాజిగూడ.. స్టోర్‌‌‌‌లో బ్రైడల్‌‌ జ్యువెలరీ షో

మలబార్‌‌‌‌  సోమాజిగూడ..  స్టోర్‌‌‌‌లో  బ్రైడల్‌‌ జ్యువెలరీ షో

హైదరాబాద్‌‌, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్‌‌‌‌ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌ సోమాజిగూడలోని తన షోరూమ్‌‌లో ‘బ్రైడల్ జ్యువెలరీ షో’ ని ప్రారంభించింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌‌‌‌ 02 వరకు ఈ షో కొనసాగుతుంది. పెళ్లి కూతుళ్ల కోసం వివిధ రకాల ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. #షోదివే థీమ్‌‌తో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీస్‌‌కు  చెందిన జ్యువెలరీని  ప్రదర్శనకు ఉంచారు.  ‘పెళ్లికూతుళ్ల కోసం కొత్త ట్రెండ్స్‌‌ను మలబార్‌‌‌‌ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌ తీసుకొస్తోంది. ఆమె  షో ను నడిపించేదనే నమ్మకాన్ని కలిపిస్తోంది. #షోదివే మెసేజ్‌‌ను తీసుకెళ్లేందుకు ఈ  క్యాంపెయిన్‌‌ స్టార్ట్ చేశాం. వావ్‌‌ అనిపించేలా జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చాం’ అని  కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. తన సబ్‌‌బ్రాండ్‌‌లు ఇండియన్‌‌ హెరిటేజ్‌‌,  చేనేత జ్యువెలరీ బ్రాండ్ డివైన్‌‌, డైమెండ్ జ్యువెలరీ బ్రాండ్‌‌ మైన్‌‌, అన్‌‌కట్ జ్యువెలరీ బ్రాండ్ ఎరా వంటి వాటిని క్యాంపెయిన్‌లో భాగంగా ప్రదర్శనకు ఉంచుతోంది.  కంపెనీ  లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్‌‌, ఏడాది పాటు అస్యూర్డ్ ఇన్సూరెన్స్‌‌ను ఆఫర్ చేస్తోంది.   గోల్డ్‌‌  ఎక్స్చేంజ్‌‌లో ఎటువంటి డిడక్షన్స్‌‌ చేయడం లేదు. అన్ని రకాల జ్యుయెలరీపైనా బై బ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. 

అంతేకాకుండా ప్రతీ నగపైన దాని బరువు, అందులో వాడిన రాళ్ల బరువు, తయారీ ఖర్చు తెలిపే ప్రైస్‌‌ ట్యాగ్‌‌ ఉంటుంది. మలబార్‌‌‌‌ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌కు  11 దేశాల్లో 325 షోరూమ్‌‌లు ఉన్నాయి.  తమకొచ్చిన లాభాల్లో 5 శాతం వాటాను ఎడ్యుకేషన్‌‌, హెల్త్‌‌, మహిళలకు సాయం చేయడానికి,  పేదవాళ్లకు ఇండ్లు కట్టివ్వడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి వాడుతున్నామని  కంపెనీ పేర్కొంది. ఇండియా, సింగపూర్‌‌‌‌, గల్ఫ్‌‌ దేశాల్లో  కలిపి 185 స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.