
అమ్మాయిల న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ కు చెందిన బీటెక్ విద్యార్థి జిష్ణు కీర్తన్ రెడ్డి ఇన్ స్టాలో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లతో ఫ్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిలతో చాటింగ్ చేస్తుండేవాడు. అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని తన న్యూడ్ ఫోటోలు అమ్మాయిలకు పెట్టి..వారి ఫోటోలు పంపించమని చెప్పేవాడు. ఇలా అమ్మాయిల ఫోటోలు సేకరించేవాడు. ప్రతి రోజు న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించేవాడు. లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించేవాడు.
ఇలా ఓ స్కూల్ విద్యార్థిని సైతం న్యూడ్ ఫోటోలు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడు. వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జిష్ణు కీర్తన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇలా చాలా మంది అమ్మాయిలను వేధించాడని పోలీసులు తెలిపారు.