
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, వర్ష సూచన లేదని తెలిపింది. హైదరాబాద్‌లోనూ గురువారం సాయంత్రం లేదా రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ ఉండొచ్చని పేర్కొంది.