
- నాలుగు రోజులు మండే ఎండలు
- 41–-45 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యే చాన్స్
- వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : రానున్న నాలుగు రోజులు మస్తు ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 4 డిగ్రీల మేర టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మొదటి రెండ్రోజులు రాష్ట్రంలోని సగం జిల్లాల్లోనే ప్రభావం ఉంటుందని అందులో పేర్కొంది.
నాలుగు రోజులు మండే ఎండలు
ఆ తర్వాతి రెండ్రోజులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 రోజులు 41 నుంచి 45 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత వాతావరణం చల్లబడుతుందని, మళ్లీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌జిల్లా దస్తూరాబాద్లో 41.7, ఆసిఫాబాద్ లోని జంబుగ, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 41.6, నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో 41.5, నిజామాబాద్ నార్త్ లో41.4, పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లి, భద్రాద్రి జిల్లా నాయుడుపేటలో 41.3, వికారాబాద్‌జిల్లా నాగారంలో 41.2 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.