రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణశాఖ. సెప్టెంబర్ 4, 5న హేవీ రెయిన్స్ పడుతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 6, 7, 8 తేదీల వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల కారణంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి ప్రభావం ఉంటుందని తెలిపారు.
Rainfall Spatial distribution forecast of Telangana for next 5 days dated 04.09.2024.@ceotelangana @telanganacmo @ecisveep @TelanganaCS @dcsofindia @association_ias @IasTelangana @tg_weather @meteorologicalcenter @telanganadgp @GHMC #ECISVEEP #CEO_Telanagna pic.twitter.com/rbxcJ7l0v0
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 4, 2024
మరోవైపు గురువారం బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. రేపటికల్లా అప్పపీడనంగా మారే చాన్స్ ఉందంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణి V6 న్యూస్ ప్రతినిధితో చెప్పారు.