Prabhas-Allu Arjun: వరద సాయం ప్రకటించిన ప్రభాస్, అల్లు అర్జున్

Prabhas-Allu Arjun: వరద సాయం ప్రకటించిన ప్రభాస్, అల్లు అర్జున్

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భారీ విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. AP సిఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రభాస్. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు ప్రభాస్. 

అల్లు అర్జున్.. తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.1కోటి అందిస్తున్నట్టు తెలిపారు. AP సిఎం రిలీఫ్ ఫండ్‌కు 50లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు ఇస్తున్నట్టు అల్లు అర్జున్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.."ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో వినాశకరమైన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని మరియు బాధను చూసి నేను బాధపడ్డాను. ఈ విపత్కర సవాలు సమయాల్లో, ప్రభుత్వాల సహాయ చర్యలకు మద్దతుగా..రెండు రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్‌లకు మొత్తం రూ.1 కోటి విరాళంగా ఇస్తున్నట్లు" అల్లు అర్జున్ ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు. 

ఇటీవలే వ‌య‌నాడ్ వరద బాధితులకు ప్రభాస్ 2 కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఇంత భారీ మొత్తం అందించడంతో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నా ప్రభాస్. దీంతో ప్రభాస్ పట్ల అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రాజు ..ఎప్పుడైనా రాజే.. అంటూ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ వ‌య‌నాడ్ రూ.25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించాడు.