
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్లపై ప్రకటించిన 10 శాతం డిస్కౌంట్ అన్ని స్లాబ్లలో అమలు కావడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త ధరలపై డిస్కౌంట్ సగటున 7.14 శాతం మాత్రమే ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు, 2-4 కిమీ దూరానికి కొత్త ధర రూ.18 నుంచి 10% డిస్కౌంట్తో రూ.16.20 ఉండాలి, కానీ రూ.17(5.56% డిస్కౌంట్)గా నిర్ణయించారు. అలాగే, 24 కిలోమీటర్ల పైన రూ.75 టికెట్ధర రూ.67.50 ఉండాలి, కానీ రూ.69(8% డిస్కౌంట్)గా నిర్ణయించారు.
ఈ విధంగా, అన్ని స్లాబ్లలో డిస్కౌంట్ 5.56% నుంచి 8.33% మధ్యలోనే ఉంది. చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ ఇలా చేయడం కరెక్ట్కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎల్ అండ్ టీ అధికారి స్పందిస్తూ.. పెంచిన ధరలపై పది శాతం డిస్కౌంట్ ఇచ్చామని, స్లాబుల వారీగా చూస్తే తక్కువ ఉంటుందని చెప్పుకొచ్చారు.
గతంలో కిలోమీటర్ల స్లాబుకు, స్లాబుకు మధ్య సగటున రూ.5 వ్యత్యాసం ఉండేది. 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10, 4 కిలోమీటర్ల వరకు వెళ్తే రూ.15, 6 కిలోమీటర్ల వరకు రూ.25, 8 కిలోమీటర్ల వరకు రూ.30, తర్వాత ప్రతి 4 కిలోమీటర్లకు సగటున రూ. 5 పెంచుతూ రూ.60 వరకు స్లాబ్స్ ఉండేవి. స్లాబ్ కిలోమీటర్మారితే రూ.5 మాత్రమే అదనంగా చెల్లించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుత స్లాబుల్లో మాత్రం ఒక కిలోమీటర్అటూ ఇటూ మార్చేసి, గత స్లాబుతో పోలిస్తే రూ.10, మరోచోట రూ.12, ఇంకోచోట రూ.16 ఇలా పెంచుకుంటూ పోయారు.
ALSO READ | మే 25 యూపీఎస్సీ ఎగ్జామ్: టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు
గత స్లాబులో గరిష్టంగా 26 కిలోమీటర్ల వరకు రూ.60 చార్జీగా నిర్ణయించారు. ఆపైన ఎంత ప్రయాణించినా రూ.60 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుత స్లాబ్ లో గరిష్టంగా కిలోమీటర్లను రూ.24కు కుదించారు. రెండు కిలోమీటర్లు తగ్గించడమే కాకుండా గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచడం గమనార్హం. ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్పై కూడా గందరగోళం నెలకొంది. పది శాతం డిస్కౌంట్ అని చెప్పి రియాలిటీలో 7.14 శాతం మాత్రమే డిస్కౌంట్ అప్లై అవుతుండటంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.