మే 25 యూపీఎస్సీ ఎగ్జామ్​: టీజీఎస్​ ఆర్టీసీ స్పెషల్​ బస్సులు

మే 25 యూపీఎస్సీ  ఎగ్జామ్​: టీజీఎస్​ ఆర్టీసీ స్పెషల్​ బస్సులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే 25 ఆదివారం జరగనుంది.  పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది.  పేపర్ 1 (జనరల్ స్టడీస్): ఉదయం 9.30 నుండి 11.30 వరకు మరియు పేపర్ 2 (CSAT) - మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  హైదరాబాద్​లో యూపీఎస్సీ  సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీజీఎస్​ ఆర్టీసీ  స్పెషల్​ సర్వీస్​ బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.  ఎగ్జామ్​ రాసే అభ్యర్థులు ప్రయాణానికి  ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.  

ALSO READ | "రైతుకు ఒకలా, మధ్యతరగతికి మరోలా".. వేతనజీవుల వెతలు.. ఇది పచ్చి నిజం!

ఎగ్జామ్​ సెంటర్స్​ కు వెళ్లే వారిని బస్​ రూట్​లకు సంబంధించి  రేతిఫైల్​.. కోటి బస్​ స్టాప్​లో హెల్ప్​లైన్​ నంబర్స్​ ఏర్పాటు చేశారు.  అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎగ్జామ్​ సెంటర్లకు బస్​ సర్వీసులునడుపుతామని టీజీఎస్​ ఆర్టీసీ  అధికారులుతెలిపారు.  పరీక్షకు హాజరు కావడానికి, అభ్యర్థులు తమ ఇ- అడ్మిట్ కార్డు ,   ఫోటో ఐడి కార్డును తీసుకెళ్లాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుపై ముద్రించిన సూచనలను చదవాలని యూపీఎస్సీ తెలిపింది.   పరీక్షకు హాజరయ్యే  అభ్యర్థులు ..  వారి ఇ- అడ్మిట్ కార్డులను  upsconline.gov.in  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.