కొత్త సంవత్సరం వేళ.. హైదరాబాద్​ మెట్రో కీలక నిర్ణయం

కొత్త సంవత్సరం వేళ.. హైదరాబాద్​ మెట్రో కీలక నిర్ణయం

న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కీలక నిర్ణయం తీసుకుంది. నగర వాసులకు ఊరట కలిగించేలా డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12:15 గంటల వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. చివరి మెట్రో రైలు 12:15 గంటలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ఇదే సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • ALSO READ | పవర్ సెక్టార్ను నిండా ముంచేశారు: డిప్యూటీ సీఎం భట్టి