ఇన్స్ట్రాలో ఫ్రెండ్షిప్ చేసి.. బాలికపై బాలుడు లైంగిక దాడి

ఇన్స్ట్రాలో ఫ్రెండ్షిప్ చేసి.. బాలికపై బాలుడు లైంగిక దాడి

కాచిగూడ, వెలుగు: గోల్నాక ప్రాంతంలో మైనర్ పై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాచిగూడ సీఐ రాజశేఖర్ తెలిపిన ప్రకారం.. తులసీరామ్ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా స్నేహంగా మారడంతో బాలుడు బాలికను నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ హోంకు తరలించినట్లు సీఐ తెలిపారు.