ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్

V6 Velugu Posted on Jun 20, 2020

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ‌‌త కొన్ని రోజులుగా క‌రోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా ప్రజలకు తెలిపారు ఎమ్మెల్యే రాజా సింగ్. తన కుటుంబంతోపాటుగా పార్టీ కార్యకర్తలందరి సాంపిల్స్ ను కూడా డాక్ట‌ర్లు సేకరించారని, రెండు రోజుల్లో రిపోర్టులు వస్తాయని ఆయన అన్నారు.

కాగా రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులుపెరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా నిత్యం శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటివ‌లే రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు కూడా వైరస్ సోకిన విష‌యం తెలిసిందే.

Tagged Hyderabad, raja singh, COVID19, tests positive, BJP MLA, Gunman

Latest Videos

Subscribe Now

More News