
పాతబస్తీలో రెచ్చిపోయిన మందుబాబు
చెంప పగులగొట్టిన వైనం
హైదరాబాద్ పాతబస్తీలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ఏకంగా పోలీసు చెంప పగులగొట్టాడు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీల్లో పలువురు మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. ఈ సందర్భంగా ఓ మందుబాబు రెచ్చిపోయాడు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. తన బండిని ఎందుకు ఆపావంటూ పోలీసులపై మహేంద్ర సింగ్ అనే వ్యక్తి చిందులు వేశాడు. అంతటితో ఆగకుండా ఓ పోలీసు చెంప పగులగొట్టాడు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.