
హైదరాబాద్ ఓపెన్–2025 పికిల్‌బాల్ టోర్నీలో కుల్దీప్ మహాజన్, అనుజా మహేశ్వరీ, వంశిక్ కపాడియా, వృషాలీ ఠాకరే.. ప్రొఫెషనల్ విభాగాల్లో చాంపియన్లుగా నిలిచారు. వంశిక్ కపాడియా, వృషాలి ఠాకరే రెండు టైటిల్స్‌తో మెరిశారు. హైదరాబాద్ సూపర్ స్టార్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫైనల్లో ప్రో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కుల్దీప్ మహాజన్ గెలుచుకోగా, విమెన్స్‌లో అనుజా మహేశ్వరీ విజేతగా నిలిచింది.
ప్రో పురుషుల డబుల్స్ టైటిల్‌ను తేజస్ మహాజన్‌తో కలిసి నెగ్గిన వంశిక్ కపాడియా.. మిక్స్‌డ్ ట్రోఫీని వృషాలి ఠాకరేతో కలిసి సాధించాడు. విమెన్స్ డబుల్స్‌లో వృషాలి–ఇషా లఖానీ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 250కి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.