దీపావళి పటాకులు కాల్చటంపై పోలీసుల వార్నింగ్.. ఆంక్షలు

దీపావళి పటాకులు కాల్చటంపై పోలీసుల వార్నింగ్.. ఆంక్షలు

దీపావళి అంటేనే టపాసుల మోత మోగుతుంది. హైదరాబాద్ ల ఐతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. భారీ శబ్ధాలతో తెల్లవారే వరకు టపాసులు కాలుస్తూనే ఉంటారు. దీంతో చాలా మంది జనం డిస్టబ్ అవుతారు.  అంతేగాకుండా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు  నవంబర్ 12 ఉదయం 6 నుండి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం, పటాకులు పేల్చడంపై హైదరాబాద్ పోలీసులు నిషేధం విధించారు.దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు తప్ప రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడం, పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధమని సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

 భారీ శబ్ధంతో వచ్చే   పటాకులను పేల్చడంపై పూర్తి నిషేదించాలన్నారు. క్రాకర్లు, డ్రమ్స్, ఇతర టపాసులు రూల్స్ అతిక్రమించకుండా పేల్చుకోవాలని సూచించారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  రూల్స్ ను అందరూ పాటించాలని..ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.