హైదరాబాద్ లో నిఘా నేత్రానికి శ్రీకారం

 హైదరాబాద్ లో నిఘా నేత్రానికి శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనితో పాటు సీఎం ఛాంబర్, సీపీ చాంబర్లను కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, డీజీపీ, సిటీ సీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  అత్యాధునిక సాంకేతికతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. దీని ఏర్పాటుతో నగర కమిషనరేట్  పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్  బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి చేరాయి.

వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది.  కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని డిపార్ట్ మెంట్ల చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్  స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీని కోసం ఏడో అంతస్తులో సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల చీఫ్ లకు ఛాంబర్లు ఉన్నాయి.