వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ కు అనుమతి నిరాకరణ

V6 Velugu Posted on Mar 31, 2021

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్‌ సాబ్ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకులకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్ 3వ తేదీన యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సిద్ధమైంది జే మీడియా ఫ్యాక్టరీ. అయితే  ఈ వేడుకలకు దాదాపు 5 నుంచి 6 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు హాజరవుతారని అంచనా. ఈవెంట్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులను అనుమతి కోరారు నిర్వాహకులు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేమని చెప్పారు పోలీసులు.పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరో వైపు వకీల్ సాబ్ ట్రైలర్ యూట్యూబ్ లో  సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో వన్ మిలియన్ లైక్స్, 20 మిలియన్ల వ్యూస్ తో దుమ్ములేపుతున్నాడు. ఏప్రిల్ 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Latest Videos

Subscribe Now

More News