వెదర్ అలర్ట్ : హైదరాబాద్ లో ఇవాళ (8వ తేదీ) భారీ వర్షం పడనుంది

వెదర్ అలర్ట్ : హైదరాబాద్ లో ఇవాళ (8వ తేదీ) భారీ వర్షం పడనుంది

ఇవాళ (సెప్టెంబర్ 8) ఉదయం నుంచి  హైదరాబాద్‌లో  పలు చోట్ల వర్షం పడుతోంది. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట ,లక్డీకపూల్, మణికొండ, సికింద్రాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో   వర్షం పడుతోంది.  మరికొన్ని గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ తెలిపింది.  హైదరాబాద్‌లో మధ్యాహ్నం , సాయంత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది . తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా మధ్యాహ్నం, సాయంత్రం వర్షాలు కురుస్తాయని  అంచనా వేసింది.  

మరోవైపు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Also Read :- హైదరాబాద్ లో పలు చోట్ల చిరుజల్లులు

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) నివేదిక ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో నిన్న రాష్ట్రంలో అత్యధికంగా 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం హైదరాబాద్‌లో తక్కువ వర్షపాతం నమోదైంది, కొన్ని ప్రాంతాల్లో 1 మి.మీ మాత్రమే నమోదైంది.