శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద.. ప్రయాణికులకు ఇబ్బందులు

శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద.. ప్రయాణికులకు ఇబ్బందులు

 హైదరాబాద్ లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.  భారీ వర్షానికి శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. ఆగస్టు 20న  కురిసిన వర్షంతో బస్టాండ్ లో ప్రాంగణంలోకి భారీగా వదర నీరు చేరింది. బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు . 

 బస్టాండ్  జాతీయ రహదారికి డౌన్ లో ఉండటంతో వర్షం పడినప్పుడ  ముంపునకు గురవుతున్నాదాని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ చుట్టుపక్క షాపులు అద్దెకు ఇవ్వడంతో బస్సులు బస్టాండ్లోకి వచ్చేటప్పుడు  ఇబ్బంది తలెత్తుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్ లో సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.