హైదరాబాద్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ డ్రా

హైదరాబాద్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ డ్రా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బ్యాటర్లు దీటుగా పోరాడటంతో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌‌‌‌తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌–డి ఎలైట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను రాజస్తాన్‌‌‌‌ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా  హైదరాబాద్‌‌‌‌ మూడు పాయింట్లు దక్కించుకుంది. 340 రన్స్‌‌‌‌ ఛేదించేందుకు మంగళవారం చివరి రోజు బరిలోకి దిగిన రాజస్తాన్‌‌‌‌ 57 ఓవర్లలో 207/3 స్కోరు చేసింది. 

సల్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (79), సచిన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (44), మహిపాల్‌‌‌‌ లోమ్రోర్‌‌‌‌ (40) రాణించారు. తనయ్‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 198/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 78 ఓవర్లలో 244/9 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. రోహిత్‌‌‌‌ రాయుడు (42), అనికేత్‌‌‌‌ రెడ్డి (21 నాటౌట్‌‌‌‌) ఫర్వాలేదనిపించారు. రాహుల్‌‌‌‌ రాధేశ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.