సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ 

హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఐజేయూ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాయుడు, రవికాంత్ రెడ్డి హాజరయ్యారు.

కె.ఎల్. రెడ్డి, వరదాచారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు పాత్రికేయ రంగానికి కె.ఎన్ రెడ్డి వరదాచారి చేసిన సేవలు చాలా గొప్పవని వక్తలు కొనియాడారు. పాత్రికేయ రంగం తొలినాళ్లలో ఇద్దరూ జర్నలిజంలోకి అడుగుపెట్టి.. ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తూ ఆ రంగానికి వన్నె తెచ్చారని చెప్పారు. పాత్రికేయ రంగంలోకి వస్తున్న వారు కె.ఎల్. రెడ్డి, వరదాచారిని ఆదర్శంగా తీసుకొని.. సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని సూచించారు.