హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్ ఇటీవల హైదరాబాద్ నగరానికి ప్రకటించిన ODF డబుల్ ప్లస్ అవార్డును GHMC కమిషనర్ దానకిశోర్ అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం నిర్వహించి న కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్వచ్ఛత ఎక్సలెన్సీ పురస్కారా న్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం చేస్తున్న కృషికి ఇది గుర్తింపు అని చెప్పారు . పది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సిటీకి రెండు గుర్తింపులు లభించడం సంతోష కరమన్నారు. ఈ స్ఫూర్తితోనే స్వచ్ఛ సర్వేక్షన్–2019లోనూ మంచి ర్యాంక్ సాధిస్తామని చెప్పారు.10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ కు ఈ పురస్కారం లభించడం అభివృద్ధికి నిదర్శణమన్నారు.
