భారత రాజ్యాంగ దినోత్సవం : ట్యాంక్బండ్ ఏరియాల్లో నేడు ( నవంబర్ 26) ట్రాఫిక్ ఆంక్షలు

భారత రాజ్యాంగ  దినోత్సవం : ట్యాంక్బండ్ ఏరియాల్లో  నేడు ( నవంబర్ 26) ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాంక్ బండ్, వెలుగు: భారత రాజ్యాంగ  దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి పాత అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇందిరా గాంధీ రోటరీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. 

బషీర్‌‌‌‌ బాగ్, లిబర్టీ, సెక్రటేరియేట్, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, లోయర్​, అప్పర్​ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలను కలిపే రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా, అవసరాన్ని బట్టి  ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులు వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సూచించారు.