ట్రాఫిక్ ఆంక్షలు : కూకట్ పల్లిలో ఈ రూట్లలో వెళ్లొద్దు

ట్రాఫిక్ ఆంక్షలు : కూకట్ పల్లిలో ఈ రూట్లలో వెళ్లొద్దు

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కూకట్ పల్లి, మూసాపేట ప్రాంతాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. కైత్లాపూర్ పది ఎకరాల్లో సభా ప్రాంగణంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు  ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్ లో మే 20న  సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి వద్ద ట్రాఫిక్ ను ఇతర దారుల్లో మళ్లింపు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ఏ ఏ ప్రాంతాల్లో అంటే.. 

మూసాపేట్, కేపీహెచ్ బీ కాలనీ, హైటెక్ సిటీ, ముసాపేట్ X-రోడ్-, కూకట్ పల్లి బస్ స్టాప్, జేఎన్టీయూ జంక్షన్, ఐడీపీఎల్ లేక్, మదాపూర్ వైపు పోలీసులు ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు. మరోవైపు హఫీజ్‌పేట్, ఐడీపీఎల్ జంక్షన్, కేపీహెచ్ బీ రోడ్ నంబర్ 1, జెఎన్టీయూ జంక్షన్, పర్వత్ నగర్ SBI సిగ్నల్ లో దారి మళ్లింపు ఉంటుంది. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.