వావ్.. ట్రాఫిక్ చలాన్లు లేని వాహనాలకు సినిమా టికెట్లు

వావ్.. ట్రాఫిక్ చలాన్లు లేని వాహనాలకు సినిమా టికెట్లు

ట్రాఫిక్ వయొలేషన్స్ ను కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ… బండ్లు నడుపుతున్నవారిని ప్రోత్సహిస్తున్నారు. సినిమా టికెట్లను గిఫ్టులుగా ఇస్తూ.. సర్ ప్రైజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో మంగళవారం రోజున అడుగడుగునా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ కనిపించారు. కూడళ్లలో టూ వీలర్లను, వాహనాలను ఆపి… నంబర్ల ఆధారంగా వాటిపై చలాన్లు చెక్ చేశారు. ఎటువంటి చలాన్లు లేని వాహనాలను గుర్తించి.. వాటిని నడుపుతున్నవారిని ప్రత్యేకంగా అభినందించారు. వారికి అక్కడికక్కడే సినిమా టికెట్లు బహుమతిగా అందజేశారు. మీలాగే మీ తోటివారికి కూడా పద్ధతిగా వాహనాలు నడిపేలా జాగ్రత్తలు తీసుకోండి … పన్నులు, చలాన్లు తగ్గించుకునేలా చూడండి అని విజ్ఞప్తిచేశారు పోలీసులు.

తనిఖీల్లో  ఎటువంటి చలాన్లు పడనివారికి సినిమా టికెట్లు గిఫ్టుగా ఇస్తే.. వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుందని ఈ డ్రైవ్ నిర్వహించామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.

పంజాగుట్ట క్రాస్ రోడ్డులో 30 మంది వాహన యజమానులకు సినిమా టికెట్లు ఇచ్చామని చెప్పారు అధికారులు.