హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

  జాతీయ రహదారుల నిర్మా ణానికి తమ పూర్తి సహకారం ఉంటుం మని స్పష్టం చేశారు. ఎన్ హెచ్ ఏఐ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో మంగళవారం సమావే శమయ్యారు. రాష్ట్రంలో ఎన్ హెచ్ ఏఐ చేపడు తున్న రహదారుల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తున్న పలు ఇబ్బందులను అధికారు లు ముఖ్యమంత్రి కి వివరించారు. 

స్పందించిన ముఖ్యమంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రహదా రులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు భేటీలో పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్య లను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఎఐ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

 హైదరాబాద్, మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎనోచ్ఎఐ అధికారులకు సూచించారు. కాంట్రాక్టు సంస్థ తో మాట్లాడి సమస్యలను పరిష్కరించా లన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని వారికి సూచించారు.

 సమావేశం లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్ హెచ్ఎఐ ప్రాజెక్ట్స్ మెంబర్ అనిల్ చౌదరి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.