వాటర్ బోర్డు.. వన్స్ మోర్..మూడోసారి 2026 వరకు ఐఎస్ఓ సర్టిఫికెట్ పొడిగింపు

వాటర్ బోర్డు.. వన్స్ మోర్..మూడోసారి 2026 వరకు ఐఎస్ఓ సర్టిఫికెట్ పొడిగింపు
  •      సిటీ జనాలకు నాణ్యతతో నీటి సరఫరా 
  •     ప్రతి రోజు 15వేల షాంపిల్స్ సేకరణ
  •     బోర్డు నీరు సురక్షితంఅంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు :  వాటర్​బోర్డు ఐఎస్​ఓ 9001 సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి పొడిగించారు.  గ్రేటర్​సిటీ వాసులకు తాగునీటిని అందించే బోర్డుకు మొదటిసారి 2017లో  ఐఎస్​ఓ దక్కింది.  2020లో గడువు ముగిసింది. మళ్లీ 2023లో మరోసారి పొడిగించారు. తాజాగా మూడోసారి 2026  వరకు పొడిగింపు లభించినట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.  తాగునీటి పంపిణీలో పాటించే నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడకుండా సప్లై చేస్తున్నట్టు  పేర్కొన్నారు.  కలుషిత కేసులు లేకుండా సురక్షితమైన వాటర్ అందిస్తున్నట్టు చెప్పారు.  నదుల నుంచి నీటిని తరలించి నిల్వ చేయడం, శుద్ధి, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్  తదితర దశల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండగా.. వాటర్​బోర్డుకు ఐఎస్ ఓ వచ్చినట్టు వివరించారు. 

రోజుకు 592 మిలియన్​ గ్యాలన్లు పంపిణీ

 మెట్రోవాటర్​బోర్డు పరిధిలో 10.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా.. రోజుకు 592 మిలియన్​గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది.  కృష్ణ ప్రాజెక్టు మూడు దశలు,  గోదావరి మొదటి దశ, ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్, సింగూరు, మంజీరా ద్వారా నీటిని తరలిస్తుంది.   దాదాపు 225 పైగా సర్వీస్​ రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికీ నీటి పంపిణీ చేస్తుంది. 

తేడాలుంటే అధికారులు అలర్ట్​ 

గ్రేటర్​సిటీలో దాదాపు కోటి మంది జనాభాకు తాగునీటిని అందించే వాటర్​బోర్డు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.  సిటీలో 250 క్లోరినేషన్​పాయింట్లను ఏర్పాటు చేసింది.  వీటి ద్వారా నీటి శుద్ధికి దాదాపు 200 లిక్విడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లోరిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్లను వినియోగిస్తుంది.  రూల్స్ ప్రకారం ఒక్కో మిలియన్​ లీటర్ల శుద్ధికి కిలో క్లోరినేషన్​ వాడుతుంది. సరఫరా చేసే నీరు సురక్షితమని, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవని బోర్డు అధికారులు తెలిపారు.  అన్ని డివిజన్లలో నీటి నాణ్యత పరిశీలనకు రోజూ 3 మొబైల్​టెస్టింగ్​ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పంపుతున్నట్లు పేర్కొన్నారు.  నీటి నాణ్యతలో  తేడాలుంటే  అధికారులను అలర్ట్ చేసి..ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు.