
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ యంగ్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించింది. జూనియర్ గర్ల్స్ టేబుల్ వాల్ట్ ఫైనల్లో నిష్కా 12,875 పాయింట్లతో గోల్డ్ నెగ్గింది. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్ ఫైనల్లో 12,800 పాయింట్లతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ సొంతం చేసుకుంది.