న్యూ ఇయర్ కు ఎటు పోదాం?..వెల్​కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత రెడీ

న్యూ ఇయర్ కు ఎటు పోదాం?..వెల్​కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత రెడీ
  •       కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పేందుకు టూర్లకు ప్లాన్ చేస్తున్న యువత
  •      ఈసారి  వీకెండ్​తో కలిసి వరుసగా మూడ్రోజులు సెలవులు 
  •       ఏపీ, కర్నాటకలోని టూరిస్ట్ స్పాట్స్​కు ఫుల్ డిమాండ్
  •      డివోషనల్ ప్లేసెస్​కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న మరికొందరు

హైదరాబాద్, వెలుగు : న్యూ ఇయర్​కు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పేందుకు సిటీ యువత రెడీ అయింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్, న్యూ ఇయర్ రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 30, 31 వీకెండ్​లో రావడం, జనవరి 1తో కలిసి వరుసగా మూడ్రోజులు సెలవులు ఉండటంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకలను మరింత డిఫరెంట్​గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువత సిద్ధమైంది.  సిటీలోని పబ్​లు, శివార్లలోని రిసార్ట్​లు, ఫాంహౌస్ లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.

అయితే, చాలామంది కొత్త వెకేషన్​లో న్యూ ఇయర్​ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఏపీలోని వైజాగ్, అరకు, మారేడుమిల్లి, యానాం, కర్నాటకలోని కూర్గ్, నందిహిల్స్, గోవాకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.  మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని డివోషనల్ ప్లేసెస్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలోని కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఎంప్లాయీస్​కు టూర్ ప్యాకేజీలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

హిల్ స్టేషన్లకు ప్రయార్టీ..

వరుస సెలవులు వస్తే  కొత్త వెకేషన్లలోనే న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకునేందుకు సిటీ యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వింటర్ సీజన్ కావడంతో తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ,  కర్ణాటకతో కేరళలోని హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. కర్నాటకలో కూర్గ్.. హిల్ స్టేషన్ , వాటర్ ఫాల్స్ కు మంచి టూరిస్ట్ స్పాట్ కాగా..

సిటీ నుంచి అక్కడికి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని టూరిస్ట్ ప్యాకేజీ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. సౌతిండియాతో పాటు నార్త్ లోని కశ్మీర్, కులుమనాలికి బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం  సిటీ నుంచి గోవాకు వెళ్లే వారి సంఖ్య  ఎక్కువగానే ఉంటుంది.

ఆలయాలకు..

జనవరి 1న ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే, వరుస సెలవుల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు వెళ్లేందుకు మరికొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. వేములవాడ, భద్రాచలం, ఏపీలోని శ్రీశైలం, అన్నవరం, విజయవాడలోని కనకదుర్గ ఆలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

వైజాగ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాం

ప్రతి ఏడాది సిటీలోనే న్యూ ఇయర్​ను సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. కానీ ఈసారి కొత్త వెకేషన్​కు వెళ్లేందుకు డిసైడ్ అయ్యాం. హాలీడేస్, బడ్జెట్​ను దృష్టిలో ఉంచుకొని వైజాగ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాం.  

– సుభాష్​, అంబర్​పేట​   

గోవాలో సెలబ్రేట్ చేసుకుంటున్నం

గత రెండేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలకు గోవాలోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి కూడా ప్రెండ్స్​తో కలిసి అక్కడికే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం.

– ప్రశాంత్ కుమార్, ఐటీ ఎంప్లాయ్, మాదాపూర్