టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న యంగ్‌‌‌‌ ఆల్​రౌండర్​

టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న యంగ్‌‌‌‌ ఆల్​రౌండర్​
  • రైజింగ్‌‌‌‌ స్టార్‌‌‌‌ రిషిత్‌‌‌‌
  • అండర్‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌ టీమ్​కు ఎంపికైన హైదరాబాదీ రిషిత్‌‌‌‌ రెడ్డి
  • టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న యంగ్‌‌‌‌ ఆల్​రౌండర్​

హైదరాబాద్‌‌‌‌‌‌, వెలుగు: ఇండియా క్రికెట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఎంతో మంది స్టార్లను అందించిన హైదరాబాద్‌‌‌‌ నుంచి మరో  రైజింగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ దూసుకొస్తున్నాడు. తన పేస్​ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌తో ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో మంచి పేరు తెచ్చుకున్న 18 ఏళ్ల నిర్వెట్ల రిషిత్‌‌‌‌ రెడ్డి నేషనల్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో అదరగొడుతున్నాడు. వినూ మన్కడ్‌‌‌‌ ట్రోఫీతో పాటు ఇండియా అండర్‌‌‌‌–19 టీమ్‌‌‌‌ తరఫున సత్తా చాటిన అతను ఇప్పుడు  అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌ బరిలోకి దిగే ఇండియా టీమ్‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌ అయ్యాడు. ఈ నెల 23 నుంచి  యూఏఈ వేదికగా  జరిగే ఈ టోర్నీ కోసం నేషనల్‌‌‌‌ జూనియర్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ 20 మంది క్రికెటర్లను ఎంపిక చేసింది. యష్‌‌‌‌ దుల్‌‌‌‌ కెప్టెన్సీలోని ఈ టీమ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ నుంచి పేస్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రిషిత్‌‌‌‌కు అవకాశం వచ్చింది. ఈ మెగా టోర్నీకి  ప్రిపరేషన్‌‌‌‌గా ఈ నెల11–19 వరకు బెంగళూరులోని నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అకాడమీ(ఎన్‌‌‌‌సీఏ)లో బీసీసీఐ ఓ క్యాంప్‌‌‌‌ ఏర్పాటు చేసింది. కాగా, ఇప్పటిదాకా ఎనిమిది ఆసియా కప్‌‌‌‌లు జరగ్గా ఇండియా అండర్‌‌‌‌–19 జట్టు ఆరు సార్లు చాంపియన్‌‌‌‌గా నిలిచింది.

అనూహ్యంగా.. 

హైదరాబాద్‌‌‌‌ గబ్చిబౌలికి చెందిన రిషిత్‌‌‌‌ రెడ్డి షార్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి శరత్‌‌‌‌ రెడ్డి వాలీబాల్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అయినా... క్రికెట్‌‌‌‌పై ఇంట్రస్ట్‌‌‌‌ ఉంది. మామ నితీశ్‌‌‌‌ రెడ్డి స్టేట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడారు. దాంతో, రిషిత్‌‌‌‌ యంగ్‌‌‌‌ఏజ్‌‌‌‌లోనే  క్రికెట్‌‌‌‌పై ఇష్టం పెంచుకున్నాడు. ప్రస్తుతం బాగ్‌‌‌‌లింగంపల్లి అంబేడ్కర్‌‌‌‌ డిగ్రీ కాలేజ్‌‌‌‌లోని  స్పాట్‌‌‌‌లైట్‌‌‌‌ అకాడమీలో కోచ్‌‌‌‌ సురేశ్‌‌‌‌ ఆధ్వర్యంలో ట్రెయినింగ్‌‌‌‌ తీసుకుంటున్నాడు. హెచ్‌‌‌‌సీఏ లీగ్స్‌‌‌‌తో పాటు  స్టేట్‌‌‌‌ అండర్‌‌‌‌–14 టీమ్‌‌‌‌ , అండర్‌‌‌‌–16 టీమ్‌‌‌‌ తరఫున సత్తా చాటాడు. లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ ప్లస్‌‌‌‌ టు పూర్తి చేసిన రిషిత్‌‌‌‌ ఆటను ఇంప్రూవ్‌‌‌‌ చేసుకునేందుకు ఈ ఇయర్‌‌‌‌ చదువుకు దూరంగా ఉన్నాడు. కెరీర్‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌ పెట్టాడు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పెంచుకున్నాడు. ఇది అతనికి చాలా హెల్ప్‌‌‌‌ అయింది. ఈ సీజన్‌‌‌‌ వినూ మన్కడ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ అండర్‌‌‌‌–19 ట్రోఫీలో ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో 13 వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌‌‌‌ను సెమీస్‌‌‌‌ చేర్చడంలో కీ రోల్‌‌‌‌ పోషించాడు. ఈ టోర్నీలో గోవాపై 6/34 బెస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేయడం అతని కెరీర్‌‌‌‌ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో  జూనియర్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ అతడిని బంగ్లాదేశ్‌‌‌‌, ఇండియా–ఎ, బి టీమ్స్‌‌‌‌ మధ్య కోల్‌‌‌‌కతాలో జరిగిన అండర్​–19 ట్రై సిరీస్‌‌‌‌కు ఎంపిక చేసింది. అప్పటికి రిషిత్‌‌‌‌ కూచ్‌‌‌‌ బెహార్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌క్లాస్‌‌‌‌ టోర్నీలో హైదరాబాద్‌‌‌‌కు ఆడుతున్నాడు. త్రిపురతో మ్యాచ్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ డే ఆట తర్వాత.. ఓ ప్లేయర్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా ట్రై సిరీస్‌‌‌‌లో ఇండియా–ఎ టీమ్‌‌‌‌లోకి వచ్చిన రిషిత్‌‌‌‌ ఈ చాన్స్‌‌‌‌ను సద్వినియోగం చేసుకున్నాడు. చాలా స్ట్రాంగ్‌‌‌‌ టీమ్‌‌‌‌ అయిన  బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఐదు వికెట్ల స్పెల్‌‌‌‌ (5/53)తో అదరగొట్టాడు. ఆరు  ఫీట్లకు పైగా ఎత్తున్న రిషిత్ ​మంచి ఇన్‌‌‌‌స్వింగర్స్‌‌‌‌తో పాటు వేరియేషన్స్‌‌‌‌తో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. దాంతో,ఆసియా కప్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ వచ్చింది. 

నా టార్గెట్‌‌‌‌ టీమిండియా

ఆసియా కప్‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌ అవుతానని అస్సలు ఎక్స్​పెక్ట్​ చేయలేదు. నేను చాలా ఎగ్జైటింగ్‌‌‌‌గా, హ్యాపీగా ఉన్నా. ట్రై సిరీస్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌పై ఐదు వికెట్లు పడగొట్టినందుకే నాకు అవకాశం వచ్చిందనుకుంటున్నా. ఈ చాన్స్‌‌‌‌ను కచ్చితంగా యూజ్‌‌‌‌ చేసుకుంటా. ఈ టోర్నీ కోసం నేను ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఫారిన్‌‌‌‌ వెళ్తున్నా. అయినా సరే బాగా ఆడాలని అనుకుంటున్నా.  బౌలింగ్‌‌‌‌లో ఇన్‌‌‌‌స్వింగర్స్‌‌‌‌,  వేరియేషన్స్‌‌‌‌ నా బలం.  మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా హిట్టింగ్‌‌‌‌ చేస్తా. ఫినిషింగ్‌‌‌‌ రోల్‌‌‌‌ ఇష్టం. బౌలింగ్‌‌‌‌లో  పేస్‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌లో హిట్టింగ్‌‌‌‌ను ఇంకొంచెం ఇంప్రూవ్‌‌‌‌ చేసుకోవాలని చూస్తున్నా. హైదరాబాద్‌‌‌‌ అండర్‌‌‌‌–19కు ఆడుతున్నప్పుడు కోచ్‌‌‌‌లు గౌస్‌‌‌‌బాబా, రొనాల్డ్ రోడ్రిగ్స్‌‌‌‌, ఆ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ నన్ను బాగా సపోర్ట్‌‌‌‌ చేశారు. ఆసియా కప్‌‌‌‌లో  రాణిస్తే.. నెక్స్ట్​ ఇయర్‌‌‌‌ అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌నకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.  బ్యాటింగ్‌‌‌‌లో ధోనీ, బౌలింగ్‌‌‌‌లో డేల్‌‌‌‌ స్టెయిన్‌‌‌‌ నా ఫేవరెట్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌. టీమిండియాకు ఆడటమే నా టార్గెట్‌‌‌‌.  ‑ వెలుగుతో రిషిత్‌‌‌‌ రెడ్డి