ఆక్రమణలు తొలగించి ప్రకృతికి వైద్యం చేస్తున్నం

ఆక్రమణలు తొలగించి ప్రకృతికి వైద్యం చేస్తున్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రకృతి పరిరక్షణ కోసం వైద్యుల మాదిరిగా తామూ వైద్యం చేస్తున్నామని హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ అన్నారు. ఆక్రమణలు తొలగించడానికి శస్త్రచికిత్స కూడా చేస్తున్నామని, డాక్టర్ల కంటే తాము ఏమాత్రం తక్కువ కాదన్నారు. జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో  గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న ఆక్రమణలను ట్యూమర్ల మాదిరి తొలగిస్తూ, కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నామని చెప్పారు.  గత 15 నెలల్లో రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను హైడ్రా రక్షించిందని అన్నారు. వచ్చే ఏడాదిలో రూ.లక్ష కోట్ల ఆస్తులు కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ షైలేంద్ర కుమార్ జోషి పాల్గొన్నారు.