
విమర్శలు, ప్రశంసల నడుమ హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉంది. లేటెస్ట్ గా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తీవ్ర ఉద్రిక్తల నడుమ భారీ పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు అధికారులు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ దగ్గర దారికి అడ్డంగా నిర్మించిన ఫ్రీ కాస్ట్ వాల్ ను కూల్చి వేశారు హైడ్రా అధికారులు. కూల్చివేతలను అడ్డుకుంటూ హైడ్రా అధికారులతో శంషాబాద్ ఆర్యవైశ్య సంఘం నేతలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు భారీగా పోలీసు బలగాలను మోహరించిన
హైడ్రా అధికారుల బృందం... ఉద్రిక్తతల మధ్యనే గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం కూల్చివేతలను పూర్తి చేశారు
ALSO READ : ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్ కవర్లు..
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ కొనసాగుతోంది. స్కూల్ పక్కనే శ్రీ అమ్మవారి ఆలయం ఉంది. అయితే గత కొంతకాలంగా స్కూలుకు వెళ్లే దారి విషయంలో ఆటు శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్, ఇటు ఆర్యవైశ్య సంఘం నేతల మధ్యన వివాదం నడుస్తోంది. చాలా రోజులపాటు ఈ దారి ఓపెన్ గా ఉన్నప్పటికీ ఇటీవల అర్యవైశ్య సంఘం నేతలు స్థలం తమ సంఘానికి చెందినదిగా పేర్కొంటూ దారికి అడ్డంగా ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణం చేపట్టారు.
ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణంలో స్కూలుకు రాకపోకలు సాగించే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దారి లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్యూల్ కమిటీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించాలని స్కూల్ కమిటీ నేతలు, ఉపాధ్యాయుల బృందం జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్కూట్ కమిటీ నేతలు ఇటీవల ఈ వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే స్కూల్ కు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
కమీషనర్ ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ గౌడ్, అర్జీఐఏ ఎస్ఐ ఉమాదేవి పోలీస్ డీఅర్ఎఫ్ బృందాలతో రంగంలోకి దిగింది హైడ్రా సిబ్బంది. భారీగా పోలీసు బలగాలని మోహరించి ప్రహారీ గోడను కూల్చివేశారు. దీంతో ఆర్యవైశ్య సంఘం నేతలు కూల్చివేతలను అడ్డుకుంటూ హైడ్రా అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వివాదానికి సంబంధించి కోర్టు స్టేటస్ కో ఆర్థర్ ఉండగా ప్రహరీ గోడలు ఏ విధంగా కూలుస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతడు దారితీసింది, అయితే ఉద్రిక్తత మధ్యన అధికారులు కూల్చివేతలను పూర్తి చేశారు.