మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని జీహెచ్ ఎంసీ పరిధిలోని పోచారంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది హైడ్రా. సోమవారం ( డిసెంబర్ 8 )కొర్రెములలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని రక్షించింది. గతంలో కూడి ఈ స్థలంలో అక్రమనిర్మాణాలు కబ్జాకోరులు చేపడితే హైడ్రా కూల్చివేసింది. తాజాగా మరోసారి కొర్రెములలో కూల్చివేత చర్యలు చేపట్టింది.
కొర్రెములలోని సిద్ధార్థ్ కాలేజీ బ్యాక్ సైడ్ పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది. పార్కు స్థలం సర్వే నంబర్ 747, 750లో ఉన్న 1034 గజాల పార్కు స్థలంలో అక్రమనిర్మాణాలు చేశారు కబ్జాదారులు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను జేసీబీలను సాయంతో కూల్చివేశారు. గతంలో ఈ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా.. మళ్లీ నిర్మాణాలు చేపట్టారు కబ్జాకోరులు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేస్తే క్రిమినల్ కేసు పెడతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.
►ALSO READ | Telangana Global Summit : మాకు మాకు పోటీ లేదు.. ప్రపంచంతోనే మా పోటీ : DK శివ కుమార్
