చెరువుల రక్షణ హైడ్రాతోనే సాధ్యం

చెరువుల రక్షణ హైడ్రాతోనే సాధ్యం
  • చెరువులు, కుంటలే గంగపుత్రులకు జీవనాధారం
  • గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్

ముషీరాబాద్, వెలుగు: చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్​జోన్ల రక్షణ హైడ్రాతోనే సాధ్యమని గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ చెప్పారు. అంబర్​పేటలోని స్టేట్​ఆఫీసులో సోమవారం ‘చెరువులు, కుంటలు బాగు’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్​మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు హైడ్రా పరిధిని రాష్ట్ర మొత్తం విస్తరించాలని కోరారు.

సిటీతోపాటు జిల్లాల్లోని చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైడ్రా కూల్చివేతలకు అనుహ్య స్పందన వస్తోందన్నారు. చెరువుల ఆధారంగా జీవిస్తున్న గంగపుత్రులు, బీసీ కుల సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి ప్రతినిధులు కైరం కొండ నర్సింగ్, చింతకింది రవి, మానకోల సురేశ్, పూస ధరణి, పూస సంపత్ గంగపుత్రతోపాటు బెల్లపు దుర్గారావు, కీర్తి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.