ఇబ్రహీంపట్నంలో హైడ్రా టీం.. పెద్దచెరువు FTL, బఫర్‪ జోన్ పరిశీలించిన అధికారులు

ఇబ్రహీంపట్నంలో హైడ్రా టీం.. పెద్దచెరువు FTL, బఫర్‪ జోన్ పరిశీలించిన అధికారులు

చెరువులు, నాలాల ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రెళ్లు పెరిగెట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ల కారణంగా కాస్త వేనక్కి తగ్గినా.. అంతే స్పీడ్ లో హై పవర్స్ తో మళ్లీ యాక్టీవ్ అయ్యింది హైడ్రా. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నం పరిధిలో హైడ్రా అధికారులు చెరువులు పరిశీలించారు. 

ALSO READ | తెలంగాణను మరో బీహార్‎గా మార్చేందుకు కుట్ర: హరీష్ రావు

హైడ్రాకు (హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్ట్) ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువుకు సంబంధించిన రాచ కాలువ, ఫిరంగి కాలువ కబ్జాకు గురైనట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రాతో పాటు ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఈరోజు పెద్దచెరువు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిశీలించారు. పెద్ద చెరువు కట్టను హైడ్రా సిబ్బంది చెక్ చేశారు. ఆనుకొని ఉన్న నిర్మాణాల గురించి ఎంక్వైరీ చేశారు.