చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్లాన్..లిస్టులో సరూర్ నగర్, అమీన్ పూర్, అంబీర్, ఫాక్స్ సాగర్ చెరువులు 

 చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్లాన్..లిస్టులో సరూర్ నగర్, అమీన్ పూర్, అంబీర్, ఫాక్స్ సాగర్ చెరువులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని నాలుగు ప్రధాన చెరువులను డెవలప్ చేసేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువులను డెవలప్ చేస్తున్న హైడ్రా, రెండో విడత కింద 14 చెరువుల పనులను చేపట్టింది.

తాజాగా నాలుగు పెద్ద చెరువులను కూడా ఆ జాబితాలో చేర్చి, పనులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సరూర్ నగర్, అమీన్ పూర్, అంబీర్, ఫాక్స్ సాగర్ చెరువులను డెవలప్ చేయలని నిర్ణయం తీసుకుంది.

చెరువుల చుట్టూ ఆక్రమణలను తొలగించడమే కాకుండా.. వాకింగ్ ట్రాకులు, లైటింగ్, పార్కులు, డ్రైనేజీ చేరకుండా డైవర్షన్ పనులను చేపట్టనున్నది. రెండో విడతలో చేపట్టిన చెరువులతోనే ఈ నాలుగు చెరువులను డెవలప్ 
చేయనున్నది.