ఆక్రమణల నుంచి ఆధీనంలోకి..కొండాపూర్ లో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

ఆక్రమణల నుంచి ఆధీనంలోకి..కొండాపూర్ లో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. కబ్జా చేసిన వేలాది కోట్ల విలువైన  ప్రభుత్వ  భూముల్ని ఆక్రమణదారుల నుంచి  స్వాధీనం చేసుకుంటోంది. ఇవాళ నవంబర్ 21న   కొండాపూర్ లో  వందల కోట్ల  విలువైన భూమిని కాపాడింది. కొండాపూర్‌ లో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. పార్కులు, ప్రజావసరాల భూములను బై నంబర్లతో ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలకు చెక్ పెట్టింది.  ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి కబ్జాకు గురైన  స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది హైడ్రా

శ్రీ వేంకటేశ్వర HAL కాలనీలో 57.20 ఎకరాల్లో 627 ప్లాట్ల లే అవుట్ ఉంది. స్థానికంగా ఉన్న పార్కులను 11 ప్లాట్లుగా చీల్చి అమ్మేసినట్లు హైడ్రా నిర్ధారించింది.  మూడు పార్కుల్లో రెండింటిని కూడా బై నంబర్లతో విక్రయించినట్లు గుర్తించింది.  బౌన్సర్లను పెట్టి లోపలికి రాకుండా అడ్డంకులు సృష్టించినట్లు నివాసితుల ఆరోపిస్తున్నారు . రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజావాణిలో  చేసిన  ఫిర్యాదు ఆధారంగా.. హైడ్రా విచారణ జరిపి ఆక్రమణకు గురైన  పార్కులను స్వాధీనం చేసుకుంది.దీంతో  కాలనీ వాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  హైడ్రాకు ధన్యవాదాతు తెలుపుతున్నారు.

అత్యంత విలువైన భూములే..

హైదరాబాద్‌‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు కోట్లకు చేరడంతో స్థానిక రాజకీయ నాయకులు, రియల్టర్లు, బిల్డర్లు, కబ్జాదారుల అండతో ప్రభుత్వ స్థలాలను, చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సిటీ పరిధిలోనైతే నాలాలు, రోడ్లు, పార్కులు, ఆఖరికి పుట్‌‌పాత్‌‌లను కూడా వదల్లేదు. ఎకరా రూ.100 కోట్లు ఉన్న ప్రాంతాల్లోనూ సర్కార్​ల్యాండ్స్​ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిని కాపాడేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, హైడ్రా వంటి సంస్థలు జియో-రిఫరెన్స్‌‌డ్ మ్యాప్‌‌లు, చారిత్రక రికార్డులను ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేయాల్సి వస్తున్నది. ఈ ఆక్రమణల వల్ల పర్యావరణానికి, జల వనరులకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఇప్పటికే సిటీలో నాలా, రోడ్లు, పార్కుల కబ్జాతో అధిక వర్షాలు, వరదలతో కాలనీలు జలమయమవుతున్న తీరును ఆధారాలతో వివరిస్తున్నారు.