JEE మెయిన్ 2026: ఈ తేదీన కరెక్షన్ విండో ఓపెన్.. ఎలా ఎడిట్ చేసుకోవచ్చంటే..?

JEE మెయిన్ 2026: ఈ తేదీన కరెక్షన్ విండో ఓపెన్.. ఎలా ఎడిట్ చేసుకోవచ్చంటే..?

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) 2026 సెషన్ 1కి హాజరయ్యే అభ్యర్థులు అప్లికేషన్ వివరాలు సరిచేసుకోవడానికి ఒకేసారి అవకాశం లభిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. తప్పులు సరిచేసుకోవడానికి  డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 2 2025 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం ఉంటుంది.

చాల మంది విద్యార్థులు ఫామ్‌లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు jeemain.nta.nic.in లో లాగిన్ అయి  సబ్మిట్ చేసిన  ఫార్మ్ వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. విండో క్లోజ్ చేసిన  తర్వాత  అవకాశం ఉండదని కూడా NTA స్పష్టం చేసింది.

తప్పులు సరిచేసుకునే  ప్రక్రియలో అభ్యర్థులు అదనంగా చార్జెస్ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇప్పటికే చార్జెస్ కట్టిన వారికీ ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ ఉండదని కూడా ఏజెన్సీ స్పష్టం చేసింది. JEE మెయిన్ 2026 సెషన్ 1 దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 27 నవంబర్ 2025,  అలాగే రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు ఉండదని కూడా NTA తెలిపింది.

మొబైల్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్,  పర్మనెంట్ & ప్రస్తుత చిరునామా, ఎమెర్జెన్సీ కాంటాక్ట్, ఫోటో సవరించలేరు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు సవరించుకోవచ్చు. 

JEE మెయిన్ 2026 ఫామ్‌  ఎలా సవరించాలంటే :మొదట jeemain.nta.nic.in  వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి adjustment విండోపై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్/DOBతో లాగిన్ అవ్వండి. ఎడిట్ దరఖాస్తు ఫామ్‌ ఓపెన్ చేసి అవసరమైన మార్పులు చేయండి. ఇప్పుడు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.